Header Banner

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రికి అరుదైన గౌరవం! కేంద్రం నుంచి కీలక బాధ్యతలు!

  Tue Apr 29, 2025 15:09        Politics

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు (AP Minister Kandula Durgesh) అరుదైన గౌరవం లభించింది. వియత్నాంలో జరిగే బుద్ద భగవానుని అవశేషాల ప్రదర్శన కార్యక్రమ బాధ్యతను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, మంత్రి కందుల దుర్గేష్‌కు అప్పగిస్తూ పీఎంవో ఈరోజు (మంగళవారం) ఆదేశాలు జారీ చేసింది. వియత్నాం ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్దుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలోని హో చి మిన్హ్ నగరంలో ప్రదర్శించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Union Minister Kiren Rijiju), రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో దేశంలోని బుద్ధుడి పవిత్ర అవశేషాలను (కపిల్వాస్తు అవశేషాలు) పటిష్ట భద్రత నడుమ భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్-ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్) చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్‌లో కేంద్రం పంపించనుంది. బౌద్ధ మత అనుచరులు ఎంతో పవిత్రంగా భావించే బుద్ధ భగవానుడి అవశేషాలను మే1 న న్యూఢిల్లీ నుంచి వియత్నాంలో ప్రదర్శనకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 6 వరకు వియత్నాంలో ప్రదర్శన జరుగనుంది. ఈ ప్రదర్శనలో బుద్ధ భగవానుడి అవశేషాలను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శన పూర్తి అయిన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ తిరిగి రాష్ట్రానికి తిరిగి రానున్నారు.

ఈ ప్రదర్శనతో వియత్నాం, భారతదేశ బౌద్ధ సమాజాలు, ప్రజల మధ్య దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. వియాత్నం వెళ్లేందుకు ఏప్రిల్ 30న మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ చేరుకోనున్నారు. మంత్రి కందుల దుర్గేష్‌కు లభించిన ప్రత్యేక గౌరవంపై ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. తనకు లభించిన అవకాశంపై మంత్రి దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండిమరో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #KandulaDurgesh #RareHonour #BuddhaRelics #VietnamVisit #TourismMinister #CentralGovtMission